ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

కర్నూలులో ఏపీ మానవహక్కుల కమిషన్‌

కర్నూల్‌లో ఆంధ్రప్రదేశ్‌ మానవ హక్కుల కమిషన్(ఏపీ హెచ్‌ఆర్‌సీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హెచ్‌ఆర్‌సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూల్‌ని మానవ హక్కుల కమిషన్‌కి హెడ్ క్వార్టర్‌గా స్పెసిఫై చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ఇక మీదట కర్నూల్ కేంద్రంగా ఏపీ మానవ హక్కుల కమిషన్ పని చేయనుంది.