మరోసారి అధికారులపై టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నోటి దురుసుతో ప్రవర్తించారు. మహిళా తహశీల్ధార్‌ను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. అధికారులను కించపరిచేలా దొంగలతో కుమ్మక్కయ్యారంటూ వ్యాఖ్యానించారు. అధికారుల పట్ల హేళనగా మాట్లాడారు. అయ్యన్న వ్యాఖ్యలపై తహశీల్ధార్ కలత చెందారు.
గిరిజన మహిళా తహశీల్ధార్‌పై ఈ రకంగా వ్యాఖ్యలు చేయడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో కూడా అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై కూడా దురుసుగా మాట్లాడారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. ఓ సీనియర్ ప్రజా ప్రతినిధిగా చెప్పుకునే అయ్యన్న తీరు మారకపోవడం దారుణం అంటున్నారు.