జమ్ము కశ్మీర్‌లో రెండు రోజుల పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కత్రా నుంచి కాలినడకన మాతా వైష్ణోదేవి ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈరోజున ఆలయ ప్రాంగణంలో ఆయన బస చేయనున్నారు. మాతకు పూజలు చేసేందుకే తాను ఇక్కడకు వచ్చానని, ఇక్కడ తాను ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని రాహుల్ పేర్కొన్నారు.
ఈ అలయం పట్ల రాహుల్‌కు ప్రత్యేక విశ్వాసం ఉందని, కొన్నేండ్లుగా ఆయన ఇక్కడకు రావాలని కోరుకుంటున్నారని జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ గులాం అహ్మద్ మిర్ చెప్పారు. రాహుల్ శుక్రవారం కాలినడకనే కిందికి దిగుతారని తెలిపారు. మాతా వైష్ణోదేవి పట్ల రాహుల్‌కు ప్రత్యేక విశ్వాసం ఉన్నందున తొలిరోజు ఆయన పర్యటన షెడ్యూల్‌లో రాజకీయ కార్యక్రమాలు ఏర్పాటు చేయలేదని మిర్ పేర్కొన్నారు.