తెలంగాణ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలని..వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం వీణవంక మండలం దేశాయ్ పల్లి పీఎస్కే గార్డెన్‌లో మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హుజురాబాద్ టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో మున్నూరు కాపులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బడుగు బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతకాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో తెలంగాలోని ప్రతి కుల సంఘానికి కమ్యూనిటీ హాల్స్ ఇస్తున్నామన్నారు.
అధికార పార్టీలో ఆర్థిక శాఖ మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఏనాడు పాటుపడ లేదని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేశారు. ఎక్కడ చూసినా గుంతలు, మట్టిరోడ్లు దర్శనమిచ్చాయి. బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుందని మంత్రి పేర్కొన్నారు. రాజేందర్ గెలిస్తే రాజాసింగ్ ,రఘునందన్ పక్కకు ఎమ్మెల్యేగా ఉంటాడు. కానీ హుజురాబాద్ నియోజకవర్గo అభివృద్ధి ఆగిపోతుంది.
అభివృద్ధి నిరంతరం కొనసాగలంటే అడగ్గానే వరాలు కురిపించే తెలంగాణ ప్రభుత్వంకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రానున్న ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓటేసి మద్దతుగా నిలవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్,డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరిచిందన్నారు. నిత్యావసరధరలు ఆకాశాన్ని అంటాయని..గ్యాస్ సిలిండర్ ధరలు పెంచారని విమర్శించారు.
ఈటల ఇన్నిరోజులు అధికారంలో ఉండి ఇప్పుడు పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడో ప్రజలకు చెప్పపాలన్నారు. ఈటల నిర్లక్ష్యంతో వెనుకబడిన హుజురాబాద్ నియోజకవర్గంలో
ప్రతి పనిని పూర్తి చేసే భాద్యతను తీసుకుంటామన్నారు. బీసీల సంక్షేమాన్ని చూస్తున్న ముఖ్యమంత్రికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
కార్యక్రమంలో పోనగంటి మల్లయ్య, నలువాల రవీందర్, కుల పెద్దలు పోతుగంటి నర్సయ్య, పురం శెట్టి చేరాలు, బండారి ముత్తయ్య ,మ్యాక వీరయ్య ,మ్యాక సత్తయ్య, పుప్పాల శంకర్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.