తెలంగాణ

గవర్నర్‌, సీఎం వినాయక చవితి శుభాకాంక్షలు

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలిగించే దైవంగా పూజలు అందుకొనే వినాయకుడు రాష్ట్ర, దేశ ప్రజల ఐక్యత, శాంతి, పురోగతి, శ్రేయసు కోసం నడిచేమార్గంలో ఎదురయ్యే అడ్డంకులను తొలిగించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు. రాజ్‌భవన్‌ ఉద్యోగులందరికీ ఆమె మట్టి గణపతులను పంపిణీ చేశారు. పిల్లల నుంచి పెద్దలదాకా అత్యంత భక్తి శ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకొనే గణపతి నవరాత్రులను పర్యావరణహితంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితోపాటు మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌ ప్రజలకు చవితి శుభాకాంక్షలు తెలిపారు.