జాతీయం ముఖ్యాంశాలు

కొత్త‌గా 25,404 పాజిటివ్ కేసులు.. 24 గంట‌ల్లో 339 మంది మృతి

ఇండియాలో గ‌త 24 గంట‌ల్లో 25,404 కోవిడ్ పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వైర‌స్ బారి నుంచి సుమారు 37 వేల మంది కోలుకున్నారు. ఇక గ‌త 24 గంట‌ల్లో వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 339గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయిన‌వారి సంఖ్య 4,43,213గా ఉంది. ఇక కోవిడ్ వ్యాక్సినేష‌న్ కూడా వేగ‌వంతంగా సాగుతోంది. 75 కోట్ల మార్క్‌ను దాటిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ ట్వీట్ చేశారు. గ‌త 24 గంట‌ల్లో 78,66,950 మందికి క‌రోనా టీకా వేసిన‌ట్లు ఆయ‌న చెప్పారు.