దేశ రాజధాని ఢిల్లీలోని లోధి రోడ్ ఉన్న సీబీఐ భవనంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం బేస్‌మెంట్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అధికారులు అప్రతమత్తమై సిబ్బందిని భవనం నుంచి ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్యానెల్ బోర్డులో మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. మధ్యాహ్నం 1.40 గంటల సమయంలో అగ్నిప్రమాదంపై సమాచారం వచ్చిందని, 2.30గంటల వరకు మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. అయితే, ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని వివరించారు.
Fire Accident | సీబీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం