ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

Corona effect |ఏకాంతంగానే శ్రీవారి బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది కూడా ఏకాంతంగానే జరగనున్నాయి. కరోనా మూడో వేవ్‌ హెచ్చరికల నేపథ్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) పాలక మండలి నిర్ణయించింది. ఈమేరకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. కొవిడ్​ మూడోదశ హెచ్చరికల దృష్ట్యా ఈ ఏడాది ఏకాంతంగా నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 7 నుంచి 15 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. వాహన సేవలన్నీ ఆలయ ప్రాకారానికే పరిమితమవుతాయని చెప్పారు.