కెనడా ప్రధానిగా మూడవసారి జస్టిన్ ట్రూడో ఎన్నికయ్యారు. లిబరల్ పార్టీ మెజార్టీ సాధించకున్నా.. ఆ పార్టీయే అధికారాన్ని చేపట్టనున్నది. అయితే ఈసారి కెనడా పార్లమెంట్ ఎన్నికల్లో 17 మంది భారతీయ సంతతి వ్యక్తులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. జగ్‌మీత్ సింగ్ నేతృత్వంలోని న్యూ డెమోక్రటిక్ పార్టీ 27 సీట్లు గెలిచి కీలకంగా మారింది. జగ్‌మీత్ మద్దతులోనే ట్రూడో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. మాజీ మంత్రులు టిమ్ ఉప్పల్, హర్జిత్ సింగ్ సజ్జన్, బర్దిశ్ చాగర్, అనితా ఆనంద్‌లు కూడా మళ్లీ ఎన్నికయ్యారు. వాంకోవర్ నుంచి రక్షణ మంత్రి హర్జిత్ సింగ్ సజ్జన్ రెండోసారి గెలిచారు. వాటర్‌లూ సీటు నుంచి ఛాగర్ విజయం సాధించారు. బ్రిటీష్ కొలంబియా నుంచి సుఖ్ దలివాల్, సర్రీ సెంటర్ నుంచి రణ్‌దీప్ సింగ్ సారాయి గెలిచారు. క్యుబెక్ నుంచి ఇండో కెనడియన్ అంజూ ధిల్లాన్ మరోసారి ఎంపీ అయ్యారు. కాల్గరి ఫారెస్ట్ లాన్ స్థానం నుంచి జస్‌రాజ్ సింగ్ హల్లన్ విక్టరీ కొట్టారు. ఎడ్మంటన్ మిల్ వుడ్స్ నుంచి ఉప్పల్ మరోసారి గెలుపొందారు. ఒంటారియాలో నలుగురు సిట్టింగ్ ఇండో కెనడియన్లు విజయం సాధించారు. ఎంపీలు మణిందర్ సిద్దూ, రూబీ సహోటా, సోనియా సిద్దు, కమల్ ఖేరాలు గెలిచారు. నేపియన్ సీటు నుంచి చంద్ర ఆర్యా విజయం సాధించారు.
Related Articles
జీఎస్టీకి నాలుగేళ్లు.. ట్యాక్స్ బేస్ రెట్టింపైందన్న నిర్మలా సీతారామన్
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఇండియాలో సుమారు మూడు దశాబ్దాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ). ఇది తొలిసారి అమలై నాలుగేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. పన్నుల వ్యవస్థ స్థిరత్వానికి చేసిన ఈ ప్రయత్నంలో చాలా వరకూ […]
అఫ్గాన్‌లో సమాంతర ప్రభుత్వం!
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఏర్పాటు చేస్తామన్న ఎన్ఆర్ఎఫ్ తాలిబన్లకు సహకరించవద్దు అంతర్జాతీయ సంస్థలను కోరిన మసూద్ పంజ్‌షీర్‌లో తాలిబన్ల మారణ హోమం అఫ్గానిస్థాన్‌లో మంగళవారం ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వం చట్టబద్ధమైంది కాదని ఆ దేశ జాతీయ ప్రతిఘటన దళం(ఎన్ఆర్ఎఫ్) ఆరోపించింది. తాలిబన్ల ప్రభుత్వానికి సమాంతరంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని […]
అపసవ్య దిశలో ప్రయాణిస్తున్నందుకు అసహనంగా ఉంది
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email టీకా తీసుకున్న వారు కూడా విధిగా మాస్కులు ధరించాలి: ఫౌచీ సంచలన వ్యాఖ్యలు కరోనా మహమ్మారిపై పోరులో అమెరికా ‘అనవసర సంకటస్థితి’ ఎదుర్కొంటోందని ఆ దేశ ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అపసవ్య దిశలో ప్రయాణిస్తున్నందుకు అసహనంగా ఉన్నట్టు చెప్పారు. […]