తెలంగాణ

Nagarjuna Sagar: 2 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం 2 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వా యర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.80 (311.4474 టీఎంసీలు) మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 9076 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 7086 క్యూసెక్కు లు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33211 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద కాల్వ ద్వారా నీటి విడుదల లేదు.

నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 67931 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొన సాగుతుండగా అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.10 అడుగులు ( 210.5133 టీయంసీలు) ఉంది. శ్రీశైలంకు 39404 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.