ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏవోబీలో ఎదురుకాల్పులు.. తప్పించుకున్న మావోయిస్టులు

ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. వారోత్సవాల దృష్ట్యా మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసిపాడు అటవీ ప్రాంతంలో చేపట్టారు. దీంతో తులసిపాడు అటవీ ప్రాంతంలో గాలింపు బృందాలకు మావోయిస్టులు తారసపడ్డారు.

ఈ సందర్భంగా ఇరువురి మధ్య కాల్పులు జరిగాయి. అయితే పోలీసులపై కాల్పులు జరుపుతూ మావోయిస్టులు తప్పించుకున్నారు. దీంతో డీవీఎఫ్‌, ఎస్‌వోజీ బలగాలు అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. పరారైన మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగిస్తున్నారు.