ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

AP: రానున్న 48గంటల్లో వర్షాలు

రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.  కాగా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లో, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వరకు విస్తరించిన సంగతి విదితమే. అలాగే నైరుతి గాలులు కూడా వీస్తున్నాయి. ఆ ప్రభావంతోనే వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు.