తెలంగాణ

Huzurabad | టీఆర్ఎస్‌లోకి క‌మ‌లాపూర్‌ క‌మ‌లం ఎంపీపీ

హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ దుర్మార్గాలు ఒక్కొక్క‌టి బ‌య‌టికి వ‌స్తుండటంతో ఆయ‌న అనుచ‌రులే ఛీ కొడుతున్నారు. ఈ క్ర‌మంలో క‌మ‌లాపూర్‌ ఎంపీపీ త‌డ‌క రాణి శ్రీ‌కాంత్ బీజేపీకి రాజీనామా చేసి, మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌, ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు వినోద్‌కుమార్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేశారు. ఆమెతోపాటు మ‌రో 300మంది కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్‌, వినోద్‌కుమార్‌లు మాట్లాడుతూ టీఆర్ఎస్ సంక్షేమ ప‌థ‌కాలే తెలంగాణ‌కు శ్రీ‌రామ‌ర‌క్ష అన్నారు. బీజేపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వ‌చ్చిన వారికి స‌ముచిత గౌర‌వం ఉంటుంద‌ని, అంతా పార్టీ అభివృద్ధికి, గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్ గెలుపున‌కు కృషి చేయాల‌ని కోరారు.