కోవీషీల్డ్ టీకాకు ఆస్ట్రేలియా వైద్య నియంత్రణ మండలి ఆమోదం తెలిపింది. భారత్‌కు చెందిన సీరం సంస్థ .. కోవీషీల్డ్ కోవిడ్ టీకాలను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. కోవీషీల్డ్ టీకా తీసుకున్న భారతీయులు ఇక నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించవచ్చు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వేలాది మంది ఇండియన్లకు ఊరటనిచ్చింది. కోవీషీల్డ్‌తో పాటు చైనాకు చెందిన సైనోవాక్ టీకాలు ఇస్తున్న రక్షణ పట్ల ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరో వైపు అంతర్జాతీయ ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను కూడా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఎత్తివేయనున్నది. నవంబర్ నుంచి విదేశీ ప్రయాణికులు రావచ్చు అంటూ ఇవాళ ఆ దేశం ప్రకటించింది. అంతర్జాతీయ ప్రయాణికులపై గత 18 నెలలుగా ఉన్న నిషేధాన్ని ఆస్ట్రేలియా ఎత్తివేసింది. సైనోవాక్, కోవీషీల్డ్ టీకాలు వేసుకున్న అంతర్జాతీయ ప్రయాణికులకు ఆటంకాలు ఉండవని స్కాట్ తెలిపారు.
Related Articles
దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email మొత్తం మృతుల సంఖ్య 4,97,975 దేశంలో కొత్తగా 1,61,386 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న 2,81,109 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 16,21,603 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనాతో నిన్న 1,733 […]
Covid-19: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గురువారం 41,195 పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 40 వేలు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2.6 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 40,120 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. […]
భారీగా పెరిగిన బంగారం ధరలు
వచ్చే ఏడాది వడ్డీ రేట్లు 75 బేసిస్ పాయింట్లు తగ్గే అవక…