జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్త‌గా 20,799 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య క్రమంగా త‌గ్గుతోంది. దేశంలో కొత్త‌గా 20,799 కేసులు నమోద‌య్యాయ‌య‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. అలాగే, నిన్న‌ 26,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న‌ 180 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌ర‌ణాల సంఖ్య మొత్తం 4,48,997కు చేరింది.

దేశంలో ప్ర‌స్తుతం 2,64,458 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,31,21,247 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 90,79,32,861 వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.