ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

రోదసిలో సినిమా షూటింగ్‌

  • ఐఎస్‌ఎస్‌కు ప్రయాణమైన రష్యా సినిమా బృందం
  • అంతరిక్షంలో తీస్తున్న మొట్టమొదటి చిత్రంగా రికార్డు

స్పేస్‌కి సంబంధించిన సినిమాలు ఇప్పటికే వచ్చాయి. అయితే, సినిమానే రోదసిలో తీయాలని బయల్దేరారు రష్యాకు చెందిన ఓ సినిమా బృందంవారు. ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్‌’ అభివృద్ధి చేసిన సూయజ్‌ ఎంఎస్‌-19 వాహకనౌకలో ఇద్దరు వ్యోమగాములు, సినిమా డైరెక్టర్‌, నటి.. భూమికి 354 కిలోమీటర్ల ఎత్తునున్న అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు మంగళవారం మధ్యాహ్నం ప్రయాణమయ్యారు. ‘ది చాలెంజ్‌’ సినిమా షూటింగ్‌ కోసం 12 రోజులపాటు వీరంతా అంతరిక్షంలో గడుపనున్నారు. రోదసిలో తీస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే.