రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నేడు నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 10:45కు తమిళిసై నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. ఉదయం 11:35 గంటలకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ రెండో అంతస్తులో సెమినార్ హాల్‌ను ప్రారంభిస్తారు.
మధ్యాహ్నం 12:30 గంటలకు పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అటునుంచి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్తారు. వర్సిటీలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కస్తారు. విశ్వవిద్యాలయంలో జరుగనున్న బతుకమ్మ వేడుకల్లో పాల్లొంటారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయణమవుతారు.