ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

శ్రీశైలంలో మూలా నక్షత్ర పూజలు

మూలా నక్షత్రం సందర్భం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవీ నిత్యాన్నదాన సత్రంలో మంగళవారం సాయంత్రం అమ్మవారిని సరస్వతీ దేవి అలంకరించిన ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చైర్మన్‌ మార్కండేయులు, అధ్యక్షుడు సుబ్బారావు తెలిపారు. సంవత్సర కాలంపాటు చిన్నారులు తాము పోగు చేసుకున్న హుండీ డబ్బులతో అమ్మవారికి 700 గ్రాముల వెండి శఠగోపాన్ని తయారు చేయించి పట్టుచీర, గాజులు, పసుపు, కుంకుమలు సారెగా సమర్పించారు. ఈ సందర్భంగా మూలా నక్షత్రం సందర్భంగా చిన్నారులతో అమ్మలవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. కార్యక్రమంలో మల్లికార్జునరావు, శివకుమార్‌ పాల్గొన్నారు.