జాతీయం ముఖ్యాంశాలు

Covid-19 | దేశంలో కొత్తగా 12 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,42,73,300కు చేరాయి. ఇందులో 3,36,55,842 మంది బాధితులు కోలుకోగా, 4,58,186 మంది వైరస్‌ వల్ల మరణించారు. మరో 1,59,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది గత 247 రోజుల్లో ఇంత తక్కువ యాక్టివ్‌ కేసులు ఉండటం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 7427 కేసులు, 62 మరణాలు ఉన్నాయి.

గత 24 గంటల్లో 14,667 మంది కోలుకోగా, 446 మంది మరణించారు. ఇప్పటివరకు 1,06,14,40,335 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీచేశామని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక అక్టోబర్‌ 30 నాటికి 60,83,19,915 నమూనాలకు పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ప్రకటించింది. ఇందులో శనివారం ఒకేరోజు 11,35,142 మందికి కరోనా పరీక్షలు చేశామని తెలిపింది.