ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్-10లోని మిలటరీ హాస్పిటల్ సమీపంలో రెండుబాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ల ధాటికి 19 మంది మృత్యువాతపడగా.. 50 మంది గాయపడ్డారు. మొదటి పేలుడు సర్దార్ మహ్మద్ దావూద్ ఖాన్ ఆసుపత్రి ముందు జరగ్గా.. రెండో పేలుడు సైతం ఆసుపత్రి పరిసరాల్లోనే జరిగినట్లు ఆఫ్ఘన్‌కు చెందిన టోలో న్యూస్ వెల్లడించింది. బాంబు పేలుళ్ల తర్వాత కాల్పులు కూడా జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలోనూ పేలుళ్లు జరిగాయి. ఆఫ్ఘన్లో పేలుళ్లు సర్వసాధారణమే అయినా.. తాలిబన్లు ఆక్రమించిన అనంతరం పరిస్థితులు మరింత దిగజారాయి. ఆగస్ట్‌లో ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ఆఫ్ఘనిస్తాన్లోని మసీదులు, పలు ప్రాంతాలపై వరుసగా దాడులు చేస్తున్నది.
Related Articles
ప్రమాదం అంచున కాటన్ బ్యారేజీ
ఉభయ గోదావరి జిల్లాలకు ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ తలమానికంగా నిలుస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ కట్టడం ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతోంది. అధికారుల అలక్ష్యం, సర్కారు నిర్లక్ష్యంతో వారథి మనుగడకు ప్రమాదం …
గిరిజన విద్యార్థినికి అంతర్జాతీయంగా గుర్తింపు.. ఏం చేసిందో తెలుసా?
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Siricilla Distic) విద్యార్థిని గుగులోతు మమత తీసిన ఫోటోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గిరిజన అమ్మాయి గుగులోత్ మమత… ఫొటోగ్రఫీ విద్యార్థిని. ఆమె తీసిన ఓ ఫొటోను తాజాగా ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ వోగ్ […]
రేపు టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుండి టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలో 39, ఏపీలోని కర్నూల్, విజయవాడలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 38,091 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. రెండు గంటల పాటు నిర్వహించే ఈ పరీక్షను ఒకేరోజు మూడు సెషన్లలో నిర్వహిస్తారు. […]