జాతీయం ముఖ్యాంశాలు

Covid 19 | దేశంలో కొత్త‌గా 10,423 పాజిటివ్ కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 10,423 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 443 మంది మ‌ర‌ణించారు. మ‌రో 15,021 మంది క‌రోనా నుంచి కోలుకున్న‌ట్టు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం దేశంలో 1,53,776 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల సంఖ్య 3,42,96,237ల‌కు చేరింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా నుంచి 3,36,83,581 మంది కోలుకోగా, 4,58,880 మంది మ‌ర‌ణించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,06,85,71,879 మంది కొవిడ్ టీకా తీసుకున్నారు.