గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని వాపిలో పేపర్ మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మిల్లు మొత్తానికి విస్తరించాయి. మంటల ధాటికి పేపరు మిల్లు పూర్తిగా దగ్ధమయింది. మిల్లులో పెద్దఎత్తున పేపరు సామాగ్రి ఉండటంతో మంటలు భారీగా ఎగసి పడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 20 ఫైర్‌ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వాపి ఫైర్ అధికారి అంకిత్ తెలిపారు. ఈ ప్రమాదం వల్ల భారీ నష్టం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఎవరికీ గాయలవలేదని వెల్లడించారు.