అంతర్జాతీయం

వ్యోమనౌకలో పాడైన బాత్‌రూమ్‌…

  • డైపర్లతో వ్యోమగాములు

ఇంట్లోని బాత్‌రూమ్‌లో ఏదైనా సమస్య వస్తే ప్లంబర్‌ను పిలిపించి నిమిషాల్లో బాగు చేయిస్తాం. అయితే, రోదసిలోని వ్యోమనౌక బాత్‌రూమ్‌లో ఏదైనా సమస్య వస్తే? దాన్ని రిపేర్‌ చేసే ప్లంబర్లు అక్కడ ఉండరు. దీంతో వ్యోమగాములు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న నలుగురు వ్యోమగాములు ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కోనున్నారు. స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ ‘ఎండీవర్‌’లో సోమవారం వీళ్లంతా భూమికి తిరిగి రావాల్సిఉన్నది. అయితే ఎండీవర్‌లోని బాత్‌రూమ్‌లో సమస్య తలెత్తింది. దీంతో నలుగురు వ్యోమగాములు డైపర్లు వేసుకోవాలని నాసా అధికారులు సూచించారు.