జాతీయం ముఖ్యాంశాలు

24 గంట‌ల్లో 10,126 కొత్త కేసులు

దేశంలో కొత్త‌గా 10,126 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఫిబ్ర‌వ‌రి నుంచి న‌మోదు అయిన పాజిటివ్ కేసుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. 266 రోజుల త‌ర్వాత అతి తక్కువ సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ చెప్పింది. గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా వ‌ల్ల 332 మంది మ‌ర‌ణించిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దేశ‌వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 1,40,638గా ఉంది. గ‌డిచిన 263 రోజుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇదే అత్య‌ల్పం అని ప్ర‌భుత్వం చెప్పింది.