కేరళలో మరో వైరస్ కలకలం రేపుతున్నది. వయనాడ్ జిల్లాలో పలువురిలో నోరో వైరస్ కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ వైరస్ సోకినవారిలో వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు వారాల క్రితం వయనాడ్ జిల్లా వైత్తిరి సమీపంలోని పూకోడ్‌లో ఉన్న వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థుల్లో ఈ నోరో వైరస్ వెలుగుచూసింది. పరిస్థితులు ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నాయని, వైరస్ తదుపరి కేసులు నమోదు కాలేదని వైద్యాధికారులు వెల్లడించారు.
కేరళలో మరో వైరస్ కలకలం