రాష్ట్రంలో వైసీపీ వచ్చిన నాటి నుంచి పాలన అస్తవ్యస్తంగా తయారైందని టీడీపీ ఎంపీ కనకమేడల అన్నారు . అమరావతి కోసం రైతులు పాదయాత్ర నిర్వహిస్తుంటే దానిని అడ్డుకోవడానికి ప్రభుత్వం నానా ప్రయత్నాలు చేస్తుందని ఆయన విమర్శించారు. ఉద్యోగులు, రైతులు , విద్యార్థులు అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నించే ప్రతిపక్షాలు, వామపక్షాలు, విద్యార్థి, రైతు సంఘాలపై ఎదురుదాడులకు దిగుతుందని పేర్కొన్నారు.
మంత్రి పేర్ని నాని రైతులపై దురంహాకార వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యుత్ చార్జిలను పెంచిందని అన్నారు.