జాతీయం ముఖ్యాంశాలు

8,865 పాజిటివ్ కేసులు.. 197 మంది మృతి

దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య త‌గ్గింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ‌వ్యాప్తంగా 8865 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. గ‌డిచిన 287 రోజుల్లో ఇదే అత్య‌ల్ప సంఖ్య‌. ఇక వైర‌స్ బారిన ప‌డి మృతిచెందిన వారి సంఖ్య 197గా ఉంది. గ‌త 24 గంట‌ల్లో సుమారు 11971 మంది వైర‌స్ నుంచి కోలుకున్నారు. దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులోడ్ 1,30,793గా ఉంది. 525 రోజుల్లో ఇదే అత్య‌ల్పం. రోజువారీ పాజిటివ్ రేటు 0.80 శాతంగా ఉంది. గ‌త 43 రోజుల్లో ఇది మ‌రో రెండు శాతం త‌క్కువ‌. వీక్లీ పాజిటివ్ రేటు 0.97గా ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.