అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

UNESCO ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు మళ్లీ ఎన్నికైన భారత్‌

ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో (UNESCO) ఎగ్జిక్కూటివ్‌ బోర్డులో భారత్‌ మరో నాలుగేండ్లపాటు కొనసాగనుంది. 2021-25 కాలానికిగాను యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు (Executive Board) జరిగిన ఎన్నికల్లో భారత్‌ 164 ఓట్లతో విజయం సాధించింది. దీంతో మరో నాలుగేండ్లపాటు యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) తీసుకునే నిర్ణయాలను పరిశీలిస్తుందని ఉంటుందని పారిస్‌లో భారత శాశ్వత ప్రతినిధి బృందం ప్రకటించింది.

ఐక్యరాజ్యసమితికి చెందిన మూడు రాజ్యాంగ విభాగాల్లో యునెస్కో ఎగ్జిక్యూటివ్‌ బోర్డ్‌ ఒకటి. దీనిని సాధారణ సమావేశం ద్వారా ఎన్నుకుంటారు. సంస్థ పనితీరును, కార్యక్రమాలను, డైరెక్టర్ జనరల్ సమర్పించిన బడ్జెట్ అంచనాలను ఇది పరిశీలిస్తుంది. ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు గ్రూప్ 4 ఆసియా, పసిఫిక్ స్టేట్స్‌లో జపాన్, ఫిలిప్పీన్స్, వియత్నాం, కుక్ ఐలాండ్స్, చైనా కూడా ఎన్నికయ్యాయి.