- భారత్‌లో మొట్టమొదటి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్
- న్యూక్లియర్, బయో, కెమికల్ యుద్ధాలను ఎదుర్కొనే శక్తి
భారత నావికా దళాన్ని మరింత శక్తివంతం చేయడానికి కీలక ముందడుగు పడింది. తీర ప్రాంత రక్షణే పరమావధిగా భారత తొలి స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ‘ఐఎన్‌ఎస్ విశాఖపట్నం’ ఆదివారం ముంబై సముద్ర తీరంలో విధుల్లోకి చేరింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
ప్రత్యేకతలు
- బహ్మోస్ సూపర్ సానిక్ వంటి శక్తివంతమైన క్షిపణులను ప్రయోగించవచ్చు
- శత్రు జలాంతర్గాములను గుర్తించి, నాశనం చేయడానికి టోర్పెడోల ఏర్పాటు
- దాడులు, సహాయ చర్యల కోసం అందుబాటులో ఏఎస్‌డబ్ల్యూ హెలికాఫ్టర్లు
- ఆయుధాలు, మందుగుండు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ యూనిట్లు అదనం
- ఎన్బీసీ (న్యూక్లియర్, బయోలాజికల్, కెమికల్) యుద్ధ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం
- శత్రు రాడార్లకు దొరక్కుండా తప్పించుకొంటూనే, దాడులు చేసే తొలి ‘స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్’
పొడవు: 163 మీటర్లు
వెడల్పు: 17.4 మీటర్లు
బరువు: 7,400 టన్నులు
వేగం: గంటకు 56 కిలోమీటర్లు
నిర్మాణం: మజగాన్ డాక్ లిమిటెడ్