ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఆ ప్రాంతాల్లో నిత్యావసరాల పంపిణీకి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు

వరద ప్రభావిత జిల్లాల్లో నిత్యవసరాల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. దీంతో వరద బారిన పడిన కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ వంటనూనె, కేజీ ఉల్లిగడ్డలు, కేజీ బంగాళా దుంపలు పంపిణీ చేయనున్నారు. వీటన్నిటిని కూడా బాధితులకు  ఉచితంగా అందించనున్నారు.