తెలంగాణ

Telangana | కిడ్నీ రోగుల‌కు ఉచిత డ‌యాల‌సిస్‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. కిడ్నీ వ్యాధి ఉన్న ఎయిడ్స్, హెప‌టైటిస్ రోగుల‌కు ఉచిత డ‌యాల‌సిస్ సేవ‌లు అందించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆరోగ్య శ్రీ స‌మీక్ష‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఈ నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్, వ‌రంగ‌ల్ న‌గ‌రాల్లో ప్ర‌త్యేక కేంద్రాల ఏర్పాటుకు హ‌రీశ్‌రావు ఆదేశాలు జారీ చేశారు.

ఈ రెండు కేంద్రాల్లో ఎయిడ్స్, హెప‌టైటిస్ రోగుల‌కు ఐదు బెడ్ల చొప్పున కేటాయించి డ‌యాల‌సిస్ సేవ‌ల‌ను అందించాల‌ని సూచించారు. త‌క్ష‌ణ‌మే ఈ కేంద్రాల‌ను అందుబాటులోకి తేవాల‌ని ఆదేశించారు. డ‌యాల‌సిస్ చేయించుకోవ‌డం కిడ్నీ రోగుల‌కు ఆర్థికంగా చాలా భారంగా మారింద‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో వారి కోసం ప్ర‌త్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిపారు.

ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ ఆధీనంలో 43 డ‌యాల‌సిస్ కేంద్రాలు న‌డుస్తున్నాయ‌ని, వీటి ద్వారా 10 వేల మంది రోగుల‌కు సేవ‌లు అందుతున్నాయ‌ని పేర్కొన్నారు. డ‌యాల‌సిస్ సెంట‌ర్ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌తి ఏడాది రూ. 100 కోట్ల‌ను ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేస్తుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. రోగుల‌ సంఖ్యకు తగినట్టుగా డయాల‌సిస్ మెషీన్లను ఏర్పాటు చేసి, వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామని గుర్తు చేశారు. ఇకముందు నుండి ఎయిడ్స్, హెపటైటిస్ రోగుల‌కు డయాల‌సిస్ కేంద్రాలను యుద్దప్రాతి పదిన ఏర్పాటు చేయలని మంత్రి హ‌రీశ్‌రావు ఆదేశించారు.

ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో‌ జరిగిన సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యద రిజ్వీ, డ్రగ్ కంట్రోల్‌ డైరెక్టర్ ప్రీతీ మీనా, ఓఎస్డీ‌ డాక్టర్ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి‌ తదితరులు పాల్గొన్నారు.