దేశంలో కొత్తగా 9119 కరోనా కేసులు నమోదవగా, మరో 396 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కు చేరగా, 4,66,980 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు 3,39,67 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,09,940 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు 539 రోజుల కనిష్ఠానికి చేరాయని తెలిపింది.
ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 132 కోట్లకుపై వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది. అందులో ఇంకా 22.72 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని, వాటిని వాడాల్సి ఉన్నదని తెలిపింది.