ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్‌ ట్వీట్‌

రాష్ట్ర శాసన మండలి చరిత్రలో మొట్ట మొదటిసారిగా మైనార్టీ మహిళ జకియా ఖానంను డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘సోదరి జకియా ఖానంకు అభినందనలు. అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచి.. మహిళా సాధికారత దిశగా ఈ ప్రభుత్వం వేసిన మరో ముందడుగు ఇది’ అని శనివారం ట్వీట్‌ చేశారు.