అంతర్జాతీయం ముఖ్యాంశాలు

Tesla Car | మంటలంటుకున్న టెస్లా కారు.. ఇళ్ల మీదకు వ్యాపించడంతో..

ప్రస్తుతం అమెరికాలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న కార్లలో టెస్లా కంపెనీ పేరు ప్రధానంగా ఉంటుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన ఈ కంపెనీ చాలా వేగంగా పెరుగుతోంది. తాజాగా ఈ కంపెనీకి చెందిన ఒక కారు మంటలంటుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది.

అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. అర్ధరాత్రి పూట పార్క్ చేసి ఉన్న ఈ కారు వెనుక భాగంలో ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు అక్కడి నుంచి పక్కనే ఉన్న ఇంటి గ్యారేజికి వ్యాపించాయి. దీంతో ఆ ఇంట్లోని వాళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగారు. అరగంట సేపు కష్టపడి మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్ వైరల్‌గా మారాయి.