దక్షిణాఫ్రికా నుంచి ఓ ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి, చండీగఢ్‌కు వచ్చిన మరొకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బెంగళూరుకు వచ్చిన వారిలో ఒకరిలో డెల్టా, మరొకరిలో డెల్టా ప్లస్‌కు భిన్నమైన వేరియంట్‌ను గుర్తించారు. ఈ నెల 26వ తేదీన వీరిద్దరూ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు వచ్చారు.
చండీగఢ్‌కు చెందిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అతని కుటుంబంలోని మరో ఇద్దరికి కూడా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరి నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీ ఎన్‌సీడీసీకి నమూనాలను పంపారు.