అంతర్జాతీయం ముఖ్యాంశాలు

లాటిన్‌ అమెరికాకు పాకిన ఒమిక్రాన్‌.. బ్రెజిల్‌లో ఇద్దరికి పాజిటివ్‌

కరోనా సరికొత్త వేరియండ్‌ ఒమిక్రాన్‌ (Omicron) ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అంతర్జాతీయ ప్రయాణికులపై నిషేధాలు విధిస్తున్నాయి. తాజాగా లాటిన్‌ అమెరికాకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందింది. తొలిసారిగా బ్రెజిల్‌లో రెండు కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం ప్రకటించింది.

నవంబర్‌ 23న దక్షిణాఫ్రికాలోని సావో పౌలో నుంచి వచ్చిన భార్యాభర్తలిద్దరికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. పరీక్షల్లో వారికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ అని తేలిందని వెల్లడించింది. వారి నమూనాలను మరో పరీక్షిండానికి ల్యాబ్‌కు పంపించామని తెలిపింది.