జాతీయం

Lok Sabha: లోక్‌స‌భలోనూ విప‌క్షాల ఆందోళ‌న‌.. స‌భ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా

లోక్‌స‌భ‌లోనూ ( Lok Sabha ) విప‌క్ష ఎంపీల ఆందోళ‌న కొన‌సాగింది. ధాన్యం సేక‌ర‌ణ‌పై టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళ‌న‌కు దిగారు. అదేవిధంగా పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌రకు హామీ ఇస్తూ చ‌ట్టం చేయాల‌ని విప‌క్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ప్ర‌భుత్వం విప‌క్షాల డిమాండ్‌ల‌ను వినిపించుకోక‌పోవ‌డంతో కాంగ్రెస్‌, డీఎంకే ఎంపీలు స‌భ నుంచి వాకౌట్ చేశారు. అయితే, ఇత‌ర పార్టీల ఎంపీలు త‌మ ఆందోళ‌న కొనసాగించారు. వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న చేస్తూ మ‌ర‌ణించిన 750 మంది రైతుల‌కు ప‌రిహారం చెల్లించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. స‌భ గంద‌ర‌గోళంగా మార‌డంతో స్పీక‌ర్ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.