మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హాటల్‌లో జర్మనీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..జర్మనీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు 2 వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు జర్మనీ రూపొందించిన విధివిధానాలు బాగున్నాయని పేర్కొన్నారు. జర్మనీ ప్రభుత్వం, అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలే జర్మనీ జీడీపీ వృద్ధికి సహకరిస్తున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఏడున్నరేండ్లలో సీఎం కేసీఆర్ పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రాధాన్యత క్రమంలో సమస్యలను పరిష్కరించాం. తొలి ప్రాధాన్యతగా విద్యుత్ సమస్యను పరిష్కరించాం. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులో ఉందని స్పష్టం చేశారు. పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. అమెరికాలో కూడా టీఎస్ ఐపాస్ లాంటి చట్టం లేదని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా 17,500 కంపెనీలకు ఇప్పటి వరకు క్లియరెన్స్ ఇచ్చామని కేటీఆర్ తెలిపారు.