అంతర్జాతీయం ముఖ్యాంశాలు

దక్షిణాఫ్రికాలో 700 రెట్లు పెరిగిన ‘ఒమిక్రాన్‌’ కేసులు

దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ కేసులు భారీగా పెరిగాయి. గత వారంతో ప్రస్తుతం కేసుల సంఖ్యను పోల్చి చూస్తే 700శాతం రెట్టింపయ్యాయి. గతవారం 2,300 కేసులు నమోదవగా.. ప్రస్తుతం 16వేలకుపైగా రికార్డవుతున్నాయి. ఇందులో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య నిర్ధిష్టంగా తెలియకపోయినా.. 70శాతానికిపైగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులే ఉన్నాయి.

కాగా, నవంబర్‌ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47కుపైగా దేశాల్లో వెలుగు చూసింది. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌తో దక్షిణాఫ్రికా, అమెరికా సహా యూరప్‌లోని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, యూరప్‌లో కొత్త వేరియంట్‌ సామాజిక వ్యాప్తి మొదలైంది నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ తీవ్రత, ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలు ఈ ఉత్పరివర్తనానికి వ్యతిరేకంగా మరింత రోగనిరోధక శక్తిని ఇస్తాయా? లేదా తెలుసుకునేందుకు పరిశోధనలు చేస్తున్నారు.