మరికొద్ది రోజుల్లో సంక్రాంతి పండగ వచ్చేస్తుంది. సంక్రాంతి అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్ద పండగ. అందుకే సంక్రాంతి వస్తుందంటే..దేశంలో ఎక్కడ ఉన్న సరే తమ సొంత ఊర్లకు వెళ్లి పండగను కుటుంబ సభ్యులతో ఎంతో సంబరంగా జరుపుకుంటుంటారు. అందుకే ప్రయాణికుల దృష్ట్యా రైల్వే , ఆర్టీసీ ప్రత్యేక సర్వీస్ లను ఏర్పటు చేసి ఎలాంటి ఆటంకం లేకుండా చేస్తుంటుంది. తాజాగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంక్రాంతి సందర్బంగా ప్రయాణికులకు శుభవార్త తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ గా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్…అప్పటి నుండి వార్తల్లో నిలుస్తూవస్తున్నారు. నష్టాలఉబిలో ఉన్న ఆర్టీసీ ని లాభాల్లోకి తెచ్చేందుకు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్న సజ్జనార్..ఇక ఇప్పుడు సంక్రాంతి సందర్భాంగా ఆన్ లైన్ లో బస్ టికెట్ల ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే.. యూపీఐ సేవలను కూడా తాజాగా అందుబాటు లోకి తీసుకు వచ్చింది ఆర్టీసీ యాజమాన్యం. https://tsrtconline.in వెబ్ సైట్ ద్వారా..టికెట్లను బుక్ చేసుకోవాలని.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో… ఈ సేవలనున ప్రయాణికులు అందరూ వినియోగించుకోవాలన్నారు. ముందే టికెట్లు బుక్ చేసుకుని.. టెన్షన్ కు దూరం చేసుకోండన్నారు.