హయత్‌నగర్‌లో ఒకరికి ఒమిక్రాన్ నిర్ధారణ
తెలంగాణాలో మరో ఒమిక్రాన్ పాజిటివ్ కేసు నమోదైంది. నగరంలోని హయత్‌నగర్‌లో 23 ఏండ్ల యువకుడికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 25కు చేరింది. హయత్‌నగర్‌కు చెందిన యువకుడు ఇటీవలే సూడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. ఒమిక్రాన్ సోకిన యువకుడిని అధికారులు గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించారు. ఈ యువకుడి కాంటాక్ట్‌లను గుర్తించి శాంపిళ్లను ఆరోగ్య శాఖ అధికారులు సేకరిస్తున్నారు.