తెలంగాణ

సంక్రాంతి తర్వాతే టీఎస్ ఆర్టీసీ చార్జీలు పెంపు

టీఎస్ ఆర్టీసీ బస్సు చార్జీలు రాష్ట్ర సర్కార్ పెంచిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు మరియు ఎక్స్‌ ప్రెస్‌ లు ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పెంచిన చార్జీలు సంక్రాంతి తర్వాతే అమలు జరుపుతారని తెలుస్తుంది.

రోజు రోజుకు పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం బస్ చార్జీలు పెంచింది. దసరా కు ముందుగానే బస్ చార్జీలు పెరుగుతాయని భావించినప్పటికీ..కుదరలేదు. ఇక ఇప్పుడు చార్జీలు పెంచక తప్పలేదు. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్ కు 25 పైసలు మరియు ఎక్స్‌ ప్రెస్‌ లు ఆపై సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే…. సిటీ ఆర్డినరీ బస్సులకు 25 పైసలు మరియు మెట్రో డీలక్స్ సర్వీసులకు 30 పైసలు పెంచాలని రవాణా శాఖ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పెంపు సంక్రాంతి తర్వాత అమల్లోకి తీసుకరావాలని చూస్తున్నారు. గడిచిన మూడేళ్లలో ఆర్టీసీ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరిగిపోయింది. ఈ మూడేళ్లలోనే ఆర్టీసీకీ రూ.4,260 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా వల్ల కొద్దిరోజులు నష్టాలు వస్తే.. పెరిగిన డీజీల్ ధరలతో మరికొన్ని నష్టాలు వచ్చాయి. పెరుగుతున్న నష్టాలను తగ్గించుకోవాలంటే టిక్కెట్ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఆర్టీసీ యాజమాన్యం అభిప్రాయపడుతుంది.

ప్రస్తుతం అమలులో ఉన్న ఛార్జీలను 2019 డిసెంబరు 5న పెంచారు. తరవాత నుంచి డీజిల్‌ ధరలు భారీగా పెరగటంతో ఛార్జీలను పెంచాలన్న ప్రతిపాదన ప్రభుత్వం వద్ద నలుగుతోంది. కానీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు చార్జీలు పెంచేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచితే.. ఇప్పుడున్న నష్టాల్లో కొంతమేరకైనా తగ్గే అవకాశాలున్నాయని ఆర్టీసీ యాజమాన్యం అంచనా వేస్తోంది. తద్వారా ఆర్టీసీ తిరిగి గాడినపడే అవకాశాలున్నట్లు అధికారులు ఆకాంక్షిస్తున్నారు.