తెలంగాణ

ఎగ్జిబిష‌న్ కు అనుమ‌తి ఇవ్వొద్దు : ఎమ్మెల్యే రాజాసింగ్

దేశ‌వ్యాప్తంగా రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయ‌ని, అందువ‌ల్ల ఎగ్జిబిష‌న్ కు అనుమ‌తి ఇవ్వొద్ద‌ని గోషామ‌హాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్‌ (నాంపల్లి ఎగ్జిబిషన్‌) కు అటంకాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నాంపల్లి ఎగ్జిబిషన్‌కు అనుమతులు ఇవ్వకపోవడంతో సోసైటి సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు కోవిడ్‌ నిబంధనలతో అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో కరోనా, ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోందని, దేశంలో చాలా రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలకు ఆంక్షలు పెడుతున్నాయని ఆయన వెల్లడించారు. కానీ.. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎగ్జిబిషన్‌కు లక్షలాదిగా ప్రజలు వస్తారని, దీని వల్ల కోవిడ్ వ్యాప్తి చెందే ప్రమాదముంద‌ని తెలిపారు. ఎగ్జిబిషన్‌కు అనుమతులు ఇవ్వవద్దని రాజాసింగ్ ప్రభుత్వాన్ని కోరారు.