ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఏపీలో కొత్తగా 166 మందికి పాజిటివ్

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,844 కరోనా శాంపిల్స్ పరీక్షించగా 166 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 31 కొత్త కేసులు నమోదు కాగా… చిత్తూరు జిల్లాలో 28, కృష్ణా జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కడప జిల్లాలో 3, శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 91 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,77,145 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 20,61,496 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,154 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,495కి పెరిగింది.