తుగ్గలి మండల పరిధిలోని గల కడమకుంట్ల,మీటే తాండ గ్రామాలకు మంగళవారం రోజున నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి వస్తున్నట్లు పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జ్ కేఈ శ్యాం బాబు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు సమయంలో మనోవేదనకు గురై కడమకుంట్ల గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వడ్డే చిన్న రాముడు,మీటే తాండ మాజీ ఎంపీటీసీ రమావత్ లక్ష్మి లు మరణించారు. నిజం గెలవాలి అనే కార్యక్రమంలో భాగంగా మరణించిన కుటుంబాలను పరామర్శించి, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని ఆమె అందజేయనున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు టిడిపి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని కే.ఈ శ్యాంబాబు తెలియజేశారు.అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శాంబాబు,మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, టిడిపి మండల అధ్యక్షుడు తిరుపాల్ నాయుడు,బీసీ సెల్ మండల ప్రెసిడెంట్ సంఘాల కృష్ణ,రాము నాయక్,తులసి నాయక్,తదితర మండల నాయకులు ఏర్పాట్లను పరిశీలించారు.