కళలు

ఓటిటి లలో రిలీజ్ సిద్దమైన పుష్ప , అఖండ , పెళ్లి సందD

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన అఖండ , పుష్ప , శ్యామ్ సింగ రాయ్ చిత్రాలు భారీ విజయాలు సాధించి మళ్లీ చిత్రసీమకు పూర్వ కళను తీసుకొచ్చాయి. ఈ తరుణంలో ఈ చిత్రాలు ఓటిటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కరోనా టైం లో సినిమా థియేటర్స్ మూతపడడంతో ఓటిటి సంస్థలు పుట్టుకొచ్చాయి. చిన్న చిత్రాల నుండి పెద్ద చిత్రాల వరకు ఓటిటి లలో రిలీజ్ కావడం తో సినీ ప్రేమికులంతా ఓటిటికి అలవాటుపడ్డారు. ఈ క్రమంలో ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయినప్పటికీ..చాలామంది థియేటర్స్ కు వెళ్లకుండా ఓటిటి లలో సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్లే సినిమాలను స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యాయి ఓటిటి సంస్థలు.

ముందుగా అల్లు అర్జున్‌ – సుకుమార్‌ కలయికలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కన ఈ సినిమా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ మంచి టాక్‌ను సొంతం చేసుకొంది. ఇక ఈ సినిమా డిజిటల్‌ హక్కులను అమేజాన్‌ ప్రైమ్‌ భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం అమేజాన్‌ ప్రైమ్‌ ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

అలాగే బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్‌ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను హాట్‌స్టార్‌ కొనుగోలు చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో జనవరిలో విడుదల కానుంది. ఇక ఓటీటీలో విడుదల కానున్న మరో చిత్రం పెళ్లి సందD. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రం హాట్‌స్టార్‌ వేదికగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద జనవరి లో టాప్ మూవీస్ ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను అలరించనున్నాయి.