కళలు

చిరు మాస్ స్టెప్స్ కు రెజీనా తట్టుకోలేకపోయింది

మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి డాన్సులు చూసే ఎంతోమంది డాన్స్ మాస్టర్ లు అయ్యారు. ఆయన డాన్సులు చూసి ఇండస్ట్రీ లోకి వచ్చినవారు ఉన్నారు. అలాంటి చిరంజీవి తన వయసు 66 కు వచ్చిన యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా తన డాన్సులతో అదరగొడుతున్నాడు. తాజాగా ఆచార్య నుండి విడుదలైన సాన కష్టం సాంగే చెపుతుంది డాన్స్ కుమ్మేసాడని.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను డైరెక్షన్ చేస్తుండడంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తుండగా..ఆయనకు జోడి గా పూజా హగ్దే నటిస్తుంది.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుండి ‘లాహే లాహే’ , ‘నీలాంబరి’ పాటలు విడుదలై శ్రోతలను విశేషంగా అలరించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ‘సానా కష్టం’ అనే పాట లిరికల్ వీడియోని విడుదల చేసారు. ‘కల్లోలం కల్లోలం ఊరూ వాడా కల్లోలం నేనొస్తే అల్లకల్లోలం.. కల్లోలం కల్లోలం కిందా మీదా కల్లోలం నా అందం అల్లకల్లోలం..’ అంటూ సాగిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ… చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ..’ అంటూ చిరు వేసిన డ్యాన్స్ ఆకట్టుకుంటోంది.

మెగా బాస్ డ్యాన్స్ లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని ‘సానా కష్టం’ సాంగ్ నిరూపిస్తోంది. థియేటర్స్ లో విజిల్స్ గ్యారంటీ అని సూచిస్తోంది. ఇందులో చిరంజీవితో కలిసి రెజీనా కాసాండ్రా ఆడిపాడింది. చిరంజీవికి పోటీగా చిందులు వేసేందుకు రెజీనా గట్టిగానే కష్టపడినట్లు తెలుస్తుంది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేసారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేసిన ఈ డ్యాన్స్ నంబర్ ను సింగర్స్ రేవంత్ – గీతామాధురి హుషారుగా ఆలపించారు.