కళలు

భవధీయుడు పాటల గురించి చెప్పుకొచ్చిన దేవి శ్రీ

పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో భవధీయుడు సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ వరుసగా ప్రాజెక్ట్స్‌ని లైన్‌లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే ‘భవదీయుడు భగత్‌సింగ్’ రూపొందనుంది. ఈ సినిమాకు దేవి శ్రీ మ్యూజిక్ అందజేస్తుండడం తో సినిమా ఫై మరింత ఆసక్తి పెరిగింది. గతంలో పవన్ కళ్యాణ్ – దేవిలా కలయికలో జల్సా , గబ్బర్ సింగ్ , అత్తారింటిది దారేది చిత్రాలు వచ్చి మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇక హరీష్ – దేవి – పవన్ ల కలయికలో గబ్బర్ సింగ్ మూవీ సాంగ్స్ అయితే ఇప్పటికి ఎక్కడో చోట వినిపిస్తూనే ఉన్నాయి. ‘దేఖో దేఖో గబ్బర్ సింగ్’ .. ‘దిల్సే దిల్సే’ వంటి ఫాస్టు బీట్లు ‘ఆకాశం అమ్మాయైతే’ అనే మెలోడీ యూత్ ను ఒక ఊపు ఊపేశాయి. మందుబాబులం .. పిల్లా నువ్వులేని జీవితం .. కెవ్వుకేక పాటలు మాస్ ఆడియన్స్ పై మంత్రల్లా పనిచేశాయి. అలాంటి ఈ ముగ్గురి కాంబినేషన్లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా రూపొందనుంది.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాను గురించి మాట్లాడాడు. ‘గబ్బర్ సింగ్’ తరువాత పవన్ – హరీశ్ శంకర్ తో కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ కావడం వలన పవన్ అభిమానులంతా కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. ఆ అంచనాలకి ఎంతమాత్రం తగ్గని అవుట్ పుట్ ఈ సారి మా దగ్గర నుంచి వెళ్లాలంటే ఇంతకుముందు కన్నా ఎక్కువగా మేము కష్టపడాలి. ఇప్పటికే నేను కొన్ని సాంగ్స్ చేశాను. చాలా ఎనర్జిటిక్ గా .. మెలోడియస్ గా ఈ ఆల్బమ్ ఉంటుంది. పవన్ కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగు స్టార్ట్ అవుతుందా అనే ఉత్సాహంతో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది” అని చెప్పుకొచ్చాడు.