ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

రమేష్ బాబు మరణవార్త షాక్ కు గురి చేసింది – చిరంజీవి

సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు..శనివారం రాత్రి తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. రమేష్ బాబు మరణించారనే వార్త కుటుంబ సభ్యులను, ఘట్టమనేని అభిమానులనే కాక సినీ ప్రముఖులను సైతం షాక్ కు గురి చేస్తుంది. ఈ తరుణంలో సినీ ప్రముఖులు ఆ కుటుంబానికి ధైర్యం చెబుతూ వారికీ అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విషాద ఘటనపై సోషల్ మీడియా ద్వారా స్పందించారు.

‘శ్రీ ఘట్టమనేని రమేష్ బాబు ఆకస్మిక మరణ వార్త విని షాక్ అయ్యి ఎంతో బాధ పడ్డాను. శ్రీ కృష్ణ గారు, మహేష్ మరియు వారి కుటుంబం పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఈ హృదయ విదారక నష్టాన్ని తట్టుకునే విధంగా ఆ భగవంతుడు మీకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ట్వీట్ చేసాడు.

ఇక కొద్దిసేపటి క్రితం రమేష్ బాబు పార్థీవదేహంను పద్మాలయ స్టూడియోస్‌కు తరలించారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. రమేష్ బాబు అంత్యక్రియల ఏర్పాట్లను ఘట్టమనేని అధిశేషగిరరావు (బంగారి) నిర్వహిస్తున్నారు. కరోనా, ఓమిక్రాన్ కారణంగా అభిమానులను దహన సంస్కారాల స్థలంలో ఎక్కువగా గుమ్మికూడకుండా ఉండాలని ఘట్టమనేని కుటుంబం అభ్యర్థించారు.

గత కొద్దీ రోజులుగా కాలేయ సమస్య తో బాధపడుతున్న రమేష్ బాబు..శనివారం ఆయన ఆరోగ్యం విషయం కావడం తో హైదరాబాద్ లోని ఏఐజి ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించగా..ఆయన అక్కడికి వెళ్లేలోపై చనిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. ఇక రమేష్ బాబు ‘అల్లూరి సీతారామరాజు’ (1974) చిత్రం ద్వారా చిత్రసీమలోకి అడుగుపెట్టారు. కృష్ణ, మహేశ్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. సుమారు 15 చిత్రాల్లో ఆయన కీలకపాత్రలో పోషించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. ‘అర్జున్‌’, ‘అతిథి’ సినిమాలు నిర్మించారు.