ఆంధ్రప్రదేశ్

ప్రతిభ హై స్కూల్ ఆధ్వర్యంలో...వర్షం కొరకు ప్రత్యేక ప్రార్థనలు.. పూజలు

కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళంలో గురువారం వరుణ దేవా.. కరుణ చూపవయ్యా అని నినాదాలు చేస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు ర్యాలీగా వెళ్లి సి..ఎస్..ఐ చర్చి ఇందు పాస్టర్ ఇమ్మానుయేల్, ఆధ్వర్యంలో  ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అక్కడనుండి శివాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 టెంకాయలను కొట్టారు అనంతరం శ్రీశ్రీశ్రీ జగద్గురు ఖాదర్ లింగ స్వామి దర్గాకు వెళ్లి ప్రత్యేక ఫాతిహాలు చేసి 101 టెంకాయలను కొట్టడం జరిగింది. అనంతరం కరస్పాండెంట్ సయ్యద్ దూద్ భాష మాట్లాడుతూ దాదాపుగా ఆషాడ మాసం మొత్తం సరైన వర్షాలు లేక పంటలు కళ్ళు ఎదురుగానే ఎండిపోతుంటే రైతుల బాధ వర్ణనాతీతం మండలంలో మొత్తం రైతులు వ్యవసాయం మీదే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కావున రైతులు ,రైతు కూలీలు క్షేమంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉంటారని తెలిపారు. అందుకే రైతు దేశానికే వెన్నెముకని అంటారు. కావున ఆ వరుణ్ దేవుడు కరుణించి కాలంలో వర్షాలు కురిపించాలని పాఠశాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరపడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ రాజు, జయలక్ష్మి, ఉపాధ్యాయులు రామలక్ష్మి, శిరీష, ముంతాజ్, ఈరన్న, సునీల్, వ్యాయామ ఉపాధ్యాయులు శివశంకర్ సూపర్వైజర్ నాగరాజు పాల్గొన్నారు.